కృష్ణాజిల్లా
విలీనం చేసే గ్రామాలు ఇలా...
న్యూస్‌రీల్
మారుతున్న నగర రూపు రేఖలు
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ముగిసిన రాష్ట్ర స్థాయి ఖో–ఖో పోటీలు
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
u8లో
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 41.5360 టీఎంసీలు.
గ్రేటర్ విజయవాడ వైపు అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా కసరత్తు ప్రారంభమైంది. గతంలో ఈ ప్రతిపాదన వచ్చినా విలీన గ్రామాల పంచాయతీల నుంచి వ్యతిరేకత రావడంతో బ్రేక్ పడింది. తాజాగా పంచాయతీల గడువు ముగుస్తున్న తరుణంలో మళ్లీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపైన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్, కార్పొరేషన్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే దాదాపు 25 లక్షల జనాభాతో గ్రేటర్ విజయవాడ రూపుదాల్చనుంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో 53 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్‌లో విలీనం చేసి, 15 లక్షల జనాభా, 469.59 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్‌లో తీర్మానం చేశారు. అప్పట్లో పంచాయతీల నుంచి వ్యతిరేకత రావడంతో కార్యం రూపం దాల్చలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పుడు ప్రతిపాదించిన 53 గ్రామాలతో పాటు మరో 21 గ్రామాలు అంటే మొత్తం 75 గ్రామాలను విలీనం చేసి, గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేసే విధంగా అధికారులు అక్టోబరు నెలలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచా యతీ పాలకవర్గాలు ఉండటంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వస్తుందనే భావనతో ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చి, పంచాయతీల నుంచి తీర్మానాలు తెప్పించుకునే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 41 గ్రామాలకు సంబంధించి పంచాయతీలకు చెందిన పాలక వర్గాల తీర్మానాలు తీసుకున్నారు. మిగిలిన 34 పంచాయతీల నుంచి వీలైనంత త్వరగా తీర్మానాలను తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనకు కౌన్సిల్‌లో కూడా తీర్మానం చేసే దిశగా పావులు కదుపుతున్నారు.
విజయవాడ నగర విస్తీర్ణం ప్రస్తుతం 61.88 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 10,34,350. ప్రస్తుతం మూడు నియోజక వర్గాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనతో 8 మండలాల్లోని 75 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్‌లో విలీనం చేస్తే గ్రేటర్ విజయవాడ విస్తీర్ణం 661.79 చదరపు కిలో మీటర్లు అంటే..దాదాపు 10 రెట్లు నగర విస్తీర్ణం పెరగ నుంది. ఈ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 20 లక్షలకు పైగా జనాభా ఉండగా, ప్రస్తుత జనాభా తీసుకుంటే 25 లక్షలకు పైగానే ఉంటుంది. గన్నవరం నియోజక వర్గంలో 31 గ్రామాలు, మైలవరం నియోజకవర్గంలో 23 గ్రామాలు, పెనమలూరు నియోజకవర్గంలో 19 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. గన్నవరం నియోజక వర్గంలో ఆత్కూరు, సూరంపల్లి, మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి, పెనమలూరు నియోజక వర్గంలో ప్రొద్దుటూరు వరకు ఉన్న గ్రామాలు గ్రేటర్‌లో కలువనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,42,916 కుటుంబాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం విజయవాడలో 2,79, 556 కుటుంబాలు ఉన్నాయి. కొండపల్లి. తాడిగడప మున్సిపాలిటీలు రద్దయ్యే అవకాశం ఉంది.
కొండపల్లి,
తాడిగడప
మున్సిపాలిటీలు
రద్దయ్యే అవకాశం
గతంలో కొన్ని
గ్రామ పంచాయతీలు
వ్యతిరేకించిన
వైనం
7
మైలవరం నియోజక వర్గంలో
23 గ్రామాలు
జి.కొండూరు మండలంలో రెండు గ్రామాలు కడింపోతవరం, కవులూరు, ఇబ్రహీంపట్నం మండలంలో 13 గ్రామాలు ఈలప్రోలు, గూడూరుపాడు, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, జూపూడి, కేతనకొండ, కొండపల్లి, మల్కాపురం, మూలపాడు, నవిపోతవరం, తుమ్మలపాలెం, త్రిలోచనాపురం, జమీ మాచవరం, విజయవాడ రూరల్ మండలంలో 8 గ్రామాలు గొల్లపూడి, జక్కంపూడి, కొత్తూరు, పైడూరుపాడు, రాయనపాడు, షాబాద, తాడేపల్లి, వేమవరం.
పెనమలూరు నియోజక వర్గంలో
19 గ్రామాలు
కంకిపాడు మండలంలో 11 గ్రామాలు దావులూరు, ఈడుపుగల్లు, గొడవర్రు, గోసాల, కంకిపాడు, కోలవెన్ను, కొణతనపాడు, ప్రొద్దుటూరు, పునాదిపాడు, ఉప్పులూరు, వేల్పూరు, పెనమలూరు మండలంలో యనమలకుదురు, గంగూరు, కానూరు, పెదపులిపాక, పెనమలూరు, పోరంకి, తాడిగడప, వణుకూరు.
గన్నవరం నియోజకవర్గంలో
31 గ్రామాలు
గన్నవరం మండలంలో 19 గ్రామాలు అజంపూడి, అల్లాపురం, బీబీ గూడెం, బుద్దవరం, బూతుమిల్లిపాడు, చినఅవుటపల్లి, గన్నవరం, జక్కులనెక్కలం, కేసరపల్లి, కొండపావులూరు, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం, సవరగూడెం, సూరంపల్లి, తెంపల్లి, వెదురుపావులూరు, వీరపనేనిగూడెం, వెంకట నరసింహాపురం(కేసరపల్లి శివారు), వెంకటనరసింహాపురం(పురుషోత్తపట్నం శివారు), ఉంగుటూరు మండలంలో రెండు గ్రామాలు ఆత్కూరు, పెదఅవుటపల్లి విజయవాడ రూరల్ మండలంలో 10 గ్రామాలు అంబాపురం, దోనే ఆత్కూరు, ఎనికేపాడు, గూడవల్లి, నిడమానూరు, నున్న, (కొంత భాగం) పాతపాడు, ఫిర్యాదినైనవరం, ప్రసాదంపాడు, రామవరప్పాడు.
పది రెట్లు పెరగనున్న నగర విస్తీర్ణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన బొర్రా వెంకటేశ్వరరావు కుటుంబం రూ.లక్ష విరాళాన్ని అందజేసింది.
గుడివాడటౌన్: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పురుషులు, మహిళల విభాగాల్లో ప్రకాశం జట్లు విజేతలుగా నిలిచాయి.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


