ఎక్స్‌ ఆర్మీ అసోసియేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ లోగో ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ ఆర్మీ అసోసియేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ లోగో ఆవిష్కరణ

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఎక్స్‌ ఆర్మీ అసోసియేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ లోగోను కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌ ఆయన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించా రు. ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ జీవితాలు అంకితం చేసి సైన్యంలో సేవలందించిన మాజీ సైనికులు పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో భాగస్వాములు కావడం గొప్ప విషమన్నారు. సమస్యలు, ఇబ్బందులు ఏవైనా ఉంటే అసోసియేషన్‌ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్స్‌ ఆర్మీ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివకుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు పియూష్‌ మండల్‌, సెక్రటరీ సుశాంత్‌, శివ, ఉత్త మ్‌, సంజీత్‌, నరేంద్రయాదవ్‌, పురుషోత్తం, రాబిన్‌ హల్దార్‌, ఎక్స్‌ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement