అర్హులందరికీ ‘చేయూత’ | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ‘చేయూత’

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

● ప్రొసీడింగ్స్‌ పంపిణీ చేస్తున్న అధికారులు ● జిల్లాలో 8,413 మందికి లబ్ధి

పెంచికల్‌పేట్‌: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్లు అందించడానికి ప్ర భుత్వం ఇటీవల అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులను ఎంపిక చేసి జాబితా రూపొందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ హరిత, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబులు లబ్ధిదారుల కు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. జిల్లాలో 9,466 దరఖాస్తులు రాగా 8,413 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో వితంతు 5,340, ఒంటరి మహిళ 1,297, దివ్యాంగ 1,776 ఉ న్నాయి. ఈనెల 12 నుంచి 18 వరకు అర్హులందరికీ ప్రొసీడింగ్స్‌ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 57వేల 262 లబ్ధిదారులు ఉండగా తాజాగా మరో 8413 మందికి ప్రభుత్వం నూతనంగా పింఛన్లు మంజూరు చేసింది. వీరిలో ఒంటరి మహిళలు, వితంతులకు రూ.2016, దివ్యాంగులకు రూ. 4016లను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఏళ్లుగా ఎదురుచూసిన వారికి ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోతున్నారు.

పంపిణీకి ఏర్పాట్లు చేశాం

కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించాం. క్షేత్రస్థాయిలో గెజిటెడ్‌ అధికారులతో విచారణ చేసి అర్హుల జాబితాను రూపొందించాం. ప్రభుత్వం వితంతు, ఒంటరి, దివ్యాంగులకు మాత్రమే ప్రొసీడింగ్స్‌ అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 18లోగా అర్హులకు ప్రొసీడింగ్స్‌ అందించేందుకు కార్యచరణ రూపొందించాం. జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో నిబంధనల ప్రకారం పింఛన్‌ బదిలీకి చర్యలు చేపడుతున్నాం. – దత్తరాం, డీఆర్‌డీవో, ఆసిఫాబాద్‌

ఆసిఫాబాద్‌ 534 102 183

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ 180 56 58

బెజ్జూర్‌ 310 108 106

చింతలమానెపల్లి 299 71 100

దహెగాం 260 81 104

జైనూర్‌ 262 78 68

కాగజ్‌నగర్‌ 492 98 191

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ 470 176 207

కెరమెరి 317 60 102

కౌటాల 408 72 121

లింగాపూర్‌ 134 21 50

పెంచికల్‌పేట్‌ 136 61 49

సిర్పూర్‌(యూ) 313 60 125

సిర్పూర్‌(టి) 359 51 80

తిర్యాణి 281 67 67

వాంకిడి 396 86 142

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement