పూల సంబురం | - | Sakshi
Sakshi News home page

పూల సంబురం

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి ఎక్కువగా ఉంటుంది. రాత్రి చలి తగ్గుతుంది. సోమవారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 8లోu

బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు

బాసరలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారు ‘మహాగౌరీ దేవి’ అలంకారంలో దర్శనమిచ్చారు.

అడుగడుగునా నీరా‘జనం’..

అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం అత్యంత వైభవోపేతంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకున్నారు.

ప్రకృతిని ఆరాధిస్తూ ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్న బతుకమ్మ వేడుకలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఆలయాలు, కూడళ్ల వద్ద బతుకమ్మకు భారీ ఏర్పాట్లు చేశారు. తంగేడు, గునుగు, బంతి వంటి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు, రంగురంగుల లైట్ల వెలుగుల్లో మహిళలు అర్ధరాత్రి వరకు ఆడిపాడి సందడి చేశారు. చివరిరోజు కావడంతో మహిళలు, యువతులు చిన్నాపెద్దా తేడా లేకుండా రెగ్యులర్‌ పాటలతో పాటు డీజే పాటలతో హోరెత్తించారు. అనంతరం గౌరవమ్మకు సద్దుల నైవేద్యం సమర్పించి వీడ్కోలు పలికారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తన నివాసంలో సతీమణి పాల్వాయి శివాణి, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మితో కలిసి బతుకమ్మను పేర్చి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆసిఫాబాద్‌లో సీఐ నీలం రవి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. – ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement