పాలపిట్టతో పర్యావరణ సమతుల్యత | - | Sakshi
Sakshi News home page

పాలపిట్టతో పర్యావరణ సమతుల్యత

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

జన్నారం: పాలపిట్ట మన పర్యావరణ సమతుల్య తను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని, పంటలకు హాని చేసే కీటకాలను తింటూ రైతులకు మేలు చేస్తుందని ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి రామ్మోహన్‌ పేర్కొన్నారు. ఆదివారం జన్నారం అటవీ డివిజన్‌లో పాలపిట్టపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్‌ను సిబ్బందితో కలిసి డివిజన్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల నరికివేత,, వ్యవసాయ పంటల్లో పురుగుమందుల అధిక వినియోగం లాంటి కారణాలతో పాలపిట్టల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. పాలపిట్టలను పట్టుకోవడం, వేటాడడం, బంధించడం, విక్రయించడం, హింసించడం లాంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు వన్యప్రాణులను సంరక్షించి, ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జన్నారం, తాళ్లపేట అటవీశాఖ రేంజ్‌ అధికారులు బాబా ఖాదర్‌వలీ, విలాస్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారులు, సెక్షన్‌ అధికారులు, బీట్‌ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement