రెబ్బెన మండలం ఇందిరానగర్ కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పొటెత్తుతున్నారు. ఆదివారం ఎనిమిదో రోజు కనకదుర్గాదేవి భక్తులకు దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాల తోపాటు మంచిర్యాల, బెల్లంపల్లి వంటి సూదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వెనుక భాగంలో గుహలో ఉన్న మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
– రెబ్బెన


