రెబ్బెన: ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతిఒక్కరూ ధ్యానానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాగజ్నగర్ సబ్ కలెక్ట ర్ హర్ష్ చౌదరి అన్నారు. గోలేటి టౌన్షిప్ లోని శ్రీరామచంద్ర మిషన్ ధ్యాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సత్సంగ్ సామూహిక ధ్యానానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ధాన్యం చేయడం ద్వారా మానసిక ఆందోళనలు దూరమవుతుందని, ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ ప్రశాంతత కోసం ధ్యానానికి సమయం కేటాయించాలని సూచించారు. చిన్నతనం నుంచే ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రిసిఫ్టర్ దీపక్ రావు, అభ్యాసకులు ఉజ్వల్కుమార్ బెహరా, మల్రాజు శ్రీనివాస్ రావు, రమేశ్, రామస్వామి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


