రెబ్బెన: పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కాళేశ్వరం మల్టీజోన్–1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా సూ చించారు. మండల కేంద్రంలోని రెబ్బెన పోలీస్స్టేషన్ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు పరిశీలించి కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. నేరస్తులకు శిక్ష పడేలా ఆ ధారాలతో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కృషి చే యాలని, పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించా రు. ఎస్సై వెంకటకృష్ణ, ఏఎస్సై నారాయణ, సిబ్బంది శ్రీనివాస్, రమేశ్, వెంకటేశ్ తదితరులున్నారు.


