నాన్నే నాకు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

నాన్నే నాకు స్ఫూర్తి

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

● ఓటమితో కుంగిపోలే.. పట్టుదల వీడలే ● యూపీఎస్సీలో నాలుగోసారి విజయం ● శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ రాజ్‌కుమార్‌ చౌహాన్‌

‘మూడు సార్లు ఓటమి ఎదురైనా కుంగిపోలేదు.. పట్టు వీడలేదు.. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించా.. నాన్నే నాకు స్ఫూర్తి..’ అని అన్నారు ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం మన్నూర్‌ గ్రామానికి చెందిన ఐపీఎస్‌ రాజ్‌కుమార్‌ చౌహాన్‌. హైదరాబాద్‌లోని సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తయిన సందర్భంగా శనివారం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సక్సెస్‌, ఇతర విషయాలు వెల్లడించారు. – ఇచ్చోడ

సాక్షి: ఐపీఎస్‌ శిక్షణ పూర్తి చేసుకున్న మీకు ముందుగా కంగ్రాట్యులేషన్‌.

రాజ్‌కుమార్‌: థాంక్యూ అండి.

సాక్షి: మీ కుటుంబ నేపథ్యం..

రాజ్‌కుమార్‌: నాన్న చౌహాన్‌ ముకుంద్‌రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ గీత గృహిణి. చెల్లి నిఖిత సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేస్తున్నారు. తమ్ముడు నవీన్‌కుమార్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు.

సాక్షి: మీ విద్యాభ్యాసం ఎలా సాగింది?

రాజ్‌కుమార్‌: 1–5వ తరగతి వరకు ఇచ్చోడలో ని ప్రైవేట్‌ స్కూల్‌లో, 6–10వ తరగతి వరకు కాగజ్‌నగర్‌లోని జవహర్‌ నవోదయలో చదివా ను. ఇంటర్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళా శాలలో, బీటెక్‌ ఎన్‌ఐటీ వరంగల్‌లో పూర్తి చే శా. తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యాను.

సాక్షి: మీ ప్రిపరేషన్‌.. విజయ ప్రస్థానం ఎలా సాగింది?

రాజ్‌కుమార్‌: యూపీఎస్సీ ప్రిపరేషన్‌ మొదలు పెట్టాక మూడుసార్లు వరుస ఓటములు. అయినా కుంగిపోలేదు. నాన్న వెన్నుతట్టి ప్రోత్సహించారు. మెంటర్స్‌ సూచనలతో తప్పులను సరి దిద్దుకుంటూ ముందుకు సాగాను. పట్టు వదలకుండా ప్రయత్నించాను. నాలుగో ప్రయత్నంలో 703వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. ప్రస్తుతం తొలివిడత శిక్షణ పూర్తయింది. డీపీటీకి రాజస్తాన్‌కు వెళ్తున్నా. ఆరు నెలల తర్వాత ఫేజ్‌ 2కు మళ్లీ పోలీస్‌ అకాడమీకి వస్తాను. తర్వాత పూర్తిగా రాజస్తాన్‌ కేడర్‌లోనే ఉంటా.

సాక్షి: యువతకు మీరిచ్చే సలహా, సూచన

రాజ్‌కుమార్‌: ఓటమిని చూసి కుంగిపోవద్దు. ప్రిపరేషన్‌లో పీర్‌ గ్రూప్‌ ఎంపిక, మెంటర్స్‌ సూచనలు కీలకం. నిబద్దత తప్పనిసరి. ఎప్పటికప్పుడు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం తథ్యం. యువతకు చాలా అవకాఽశాలు ఉన్నాయి. వాటిని దక్కించుకోవడానికి కృషి చేయాలి.

సాక్షి: మీకు స్ఫూర్తి ఎవరు..?

రాజ్‌కుమార్‌: నాన్నే నాకు స్ఫూర్తి. ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా ఉన్నందున చిన్నప్పటి నుంచే ఒక్కటే చెప్పేది. క్రమశిక్షణ తో పాటు అందరికంటే ప్రత్యేకత కలిగి ఉండాలని సూచించేవారు. అలాగే బీఆర్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర ద్వారా స్ఫూర్తి పొందాను. ఇంకా ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ స్ఫూ ర్తితో ముందుకు సాగాను. నవోదయలో ప్రిన్సిపాల్‌, సిబ్బంది ఇచ్చిన ప్రేరణ న న్ను ఐపీఎస్‌ వైపు అడుగులు వేయించింది. అక్కడ చదువుకున్న రోజుల్లో పాఠశాలకు వచ్చే ఉన్నతస్థాయి అధికారులు ఇ చ్చిన స్ఫూర్తి నాలో ప్రేరణగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement