మా ఊరి సంత | - | Sakshi
Sakshi News home page

మా ఊరి సంత

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

● అందుబాటులో అన్ని రకాల వస్తువులు ● ధర తక్కువ, తాజాదనం, నాణ్యత అధికం ● ఆదివాసీలకు అండగా నిలుస్తున్న అంగళ్లు ● పండుగ వేళ అధికంగా పెరిగిన ఆదరణ

కెరమెరి: గ్రామీణ సంస్కృతిలో భాగమైన అంగళ్లకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. వార సంతలే గిరి గ్రా మాల జనాలకు అండగా నిలుస్తున్నాయి. తాజా కూరగాయలు, వివిధ రకాల ధాన్యాలు, నిత్యావసరాలు, దుస్తులు.. ఇలా అన్నీ ఒకేచోట లభిస్తుండగా ఆదివాసీలు వీటిని ఆదరిస్తున్నాయి. దళారుల ప్ర మేయం లేకుండా రైతులు, చిరువ్యాపారులే సంతలో విక్రయాలు జరుపుతుండగా ఆదివాసీలకు త క్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు, పప్పు దినుసులు, నిత్యావసరాలు, దుస్తులు లభిస్తున్నాయి. అడవులు, కొండ కోనలను దాటుకుంటూ ఏజెన్సీ ప్రాంతవాసులు సమీప సంతలకు చేరుకుని తమకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మార్కెట్‌లో ఆకాశాన్నంటుతున్నఽ ధరలతో సతమతమవుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ సంతలు కొండంత సాంత్వన చేకూరుస్తున్నా యి. ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో కొనుగోళ్లతో సంతలు కళకళలాడుతున్నాయి.

అటవీ ఉత్పత్తులు కూడా..

గ్రామాల్లో పండిన కూరగాయలు, ఆ కుకూరలు దళారులు రైతుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేసి పట్టణా ల్లో రెట్టింపు ధరలకు విక్రయించడం సాధారణం. కానీ, జిల్లాలోని ఏజెన్సీతో పాటు ఇతర మండలాల్లో వారసంతల్లో స్థానిక గిరిజన ఉత్పత్తులు ప్రేత్యక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రైతులు తమ పెరటి తోటల్లో రసాయనాలు లేకుండా పండించిన తాజా కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలైన జొన్నలు, కొర్రలు, రాగులు, వివిధ రకాల పండ్లు బట్టుల్లో తెచ్చి అమ్ముతున్నారు. అటవీప్రాంతంలో సహజసిద్ధంగా లభించే ఇప్పపువ్వు, చింతపండు, వెదురు చిగుళ్లు కూడా విక్రయిస్తుంటారు. అలాగే, ఇళ్లల్లో తయారు చేసే పసుపు, కారం, వివిధ రకాల సంప్రదాయ పిండివంటలు, గృహోపకరణాలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.

వసతులు లేక అవస్థలు

సంతలకు దినదినం ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలని స్థానిక రైతులు, ప్రజలు కోరుతున్నారు. వానాకా లంలో సంత స్థలాల్లో బురద సమస్య తల్తెకుండా సిమెంట్‌ ప్లాట్‌ఫాంలు, ఐటీడీఏ, పంచాయతీరాజ్‌ నిధులతో షెడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తక్కువకే దొరుకుతున్నయ్‌

పట్టణాల్లోని ధరలతో పో ల్చితే వారసంతల్లో కూరగా యలు, ఆకుకూరలు తక్కువ ధరకే లభిస్తాయి. పైగా, తాజాగా ఉంటాయి. ఇతర నిత్యావసరాలు, దుస్తులు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. దీంతో పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం వస్తలేదు. – సూర్యవంశీ కవిత, గృహిణి, కెరమెరి

గిట్టుబాటు అవుతోంది

నేను పండించిన తాజా ఆకుకూరలు, కూరగాయలు వారంలో నాలుగు అంగళ్లకు తీసుకువెళ్లి అమ్ముతున్న. గతంలో దళారులకు విక్రయించి నష్టపోయిన. ఇప్పుడు నేనే సంతలో కూర్చుని అమ్ముకుంటున్న.కూరగాయలు తాజాగా ధర గిట్టుబాటుఅవుతోంది.

– సెండే అక్కుబాయి, రైతు, కెరమెరి

జిల్లాలో వారసంతల వివరాలు

వారం సంత జరిగే ప్రాంతాలు

ఆదివారం కెరమెరి, కాగజ్‌నగర్‌, బెజ్జూర్‌

సోమవారం కౌటాల

మంగళవారం దహెగాం, లింగాపూర్‌

గురువారం వాంకిడి, జైనూర్‌, రెబ్బెన(గోలేటి)

శుక్రవారం చింతలమానెపల్లి, సిర్పూర్‌(యు), తిర్యాణి

శనివారం ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement