భావితరాలకు గాంధీజీ విలువలు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

భావితరాలకు గాంధీజీ విలువలు ఆదర్శం

Oct 2 2026 11:56 PM | Updated on Oct 2 2026 11:56 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: భారత దేశానికే కాకుండా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన గాంధీజీ ఆశయాలు, వి లువలు భావితరాలకు ఆదర్శమని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముడు పాటించిన సత్యం, అహింస, శాంతి, నైతిక విలువలను తల్లి దండ్రులు తమ పిల్లలకు తెలిజేయాలన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులకు ఆయన జీవిత చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్ర గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్‌ వామనమూర్తి, సీఐ నీలం రవి, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement