లక్ష్యానికి చేరువ! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి చేరువ!

Oct 2 2026 11:56 PM | Updated on Oct 2 2026 11:56 PM

టార్గెట్‌కు అనుగుణంగా ‘వనమహోత్సవం’ 92.67 శాతం మొక్కలు నాటిన అధికార యంత్రాంగం ‘అమ్మ పేరుతో మొక్క’ పేరుతోనూ ప్రత్యేక కార్యక్రమాలు ఎండల నుంచి సంరక్షిస్తేనే ప్రయోజనం

వాంకిడి: జిల్లాలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమం లక్ష్యానికి చేరువైంది. ఎల్‌నినో ప్రభావం ఉన్నా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో 13 శాఖలు తమకు కేటాయించిన టార్గెట్‌కు అనుగుణంగా మొక్కలు నాటాయి. ఇందులో అత్యధికంగా డీఆర్‌డీఏకు 32.50 లక్షలు, అటవీ శాఖకు 6.45 లక్షల మొక్కలు లక్ష్యంగా కేటాయించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడంతో జూన్‌లోనే ప్రారంభించాల్సిన వనమహోత్సవం కార్యక్రమాన్ని ఆగస్టులో మొదలుపెట్టారు. వేగంగా లక్ష్యాన్ని పూర్తిచేయడంలో కొన్ని మండలాలు వెనుకబడ్డాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటుతూనే ఉన్నారు.

43.354 లక్షలు నాటి..

జిల్లాలోని 335 పంచాయతీల్లో వనమహోత్సవం కోసం అవసరమైన మొక్కలు పెంచేందుకు నర్సరీ లు ఏర్పాటు చేశారు. 2025– 26 సంవత్సరానికి అన్నిశాఖలు కలిపి 46.78 లక్షల మొక్కలు నాటాల ని నిర్ణయించారు. తాజా నివేదిక ప్రకారం 43.354 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు వెల్లడించా రు. రికార్డుల ప్రకారం 92.67 శాతం పూర్తి కాగా మ రో 7.33 శాతం మొక్కలు నాటాల్సి ఉంది. డీఆర్‌డీఏ శాఖకు కేటాయించిన 32.64 లక్షల మొక్కల లక్ష్యంలో ఇంటి అవసరాలకు సంబంధించినవి 8.55 లక్షలు, ఈజీఎస్‌ నిధులతో 24 లక్షలు నాటా లని కార్యాచరణ రూపొందించారు. జూన్‌లో 18 శాతం లోటు వర్షపాతం ఉండటంతో జూలై వరకు 3.51 లక్షల మొక్కలు మాత్రమే నాటారు. అనంతరం కొంతవేగం పెంచి లక్ష్యానికి చేరువయ్యారు. గృహాలకు పండ్లు, పూలమొక్కలు పంపిణీ చేయగా.. ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద వివిధ రకాల మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటారు.

సంరక్షణే కీలకం

వనమహోత్సవం కార్యక్రమాన్ని జూన్‌లో ప్రారంభించాల్సి ఉంటుంది. సీజన్‌ ప్రారంభంలోనే మొక్కలు నాటితే నాలుగు నెలలపాటు కురిసే వర్షాలతో బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ లోటు వర్షపాతం కారణాన్ని చూపుతూ అధికారులు జాప్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా చేపట్టిన వనమహోత్సవం పలు ప్రాంతాల్లో ఇ ప్పటికీ కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్‌తో వర్షకా లం పూర్తయ్యింది. నైరుతి వెళ్లిపోవడంతో ఇక వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతం నాటుతున్న మొక్కల సంరక్షణ కీలకంగా మారనుంది. అధికారులు తమ టార్గెట్‌ పూర్తి చేయాలనే తపనతోనే ఇప్పుడు మొక్కలు నాటుతున్నారని ప్రజల నుంచి విమర్శలు సైతం వస్తున్నాయి.

శాఖల వారీగా నాటిన మొక్కలు

శాఖ లక్ష్యం నాటినవి

అటవీశాఖ 6.45లక్షలు 8.43లక్షలు

డీఆర్‌డీఏ 32.5లక్షలు 32లక్షలు

విద్యాశాఖ 40,000 22,000

ఇరిగేషన్‌ 30,000 15,000

మున్సిపల్‌ 3.20లక్షలు 1.52లక్షలు

ఎస్‌సీసీఎల్‌ 1.90లక్షలు 81,000

హర్టికల్చర్‌ 20,000 5,000

వ్యవసాయ 30,000 7,000

ఆర్‌అండ్‌బీ 5000 1000

మత్స్యశాఖ 5000 1000

మహిళాశిశు సంక్షేమ 5000 1000

రెవెన్యూ 10,000 1000

ఎకై ్సజ్‌ 50,000 5000

మొత్తం 46.78లక్షలు 43.35

డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు(లక్షల్లో)

మండలం లక్ష్యం నాటినవి

ఆసిఫాబాద్‌ 2.54 2.51

బెజ్జూర్‌ 2.15 2.13

చింతలమానెపల్లి 1.85 1.78

దహెగాం 2.34 2.28

జైనూర్‌ 2.54 2.35

కాగజ్‌నగర్‌ 2.73 2.68

కెరమెరి 3.03 2.98

కౌటాల 1.95 1.85

లింగాపూర్‌ 1.36 1.32

పెంచికల్‌పేట్‌ 1.17 1.12

రెబ్బెన 2.34 2.28

సిర్పూర్‌(టి) 1.56 1.43

సిర్పూర్‌(యు) 1.46 1.43

తిర్యాణి 2.83 2.79

వాంకిడి 2.73 2.68

మొత్తం 32.64 31.68

అమ్మ పేరుతో మొక్క..

మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి కాపాడుకోవాలనే ఉద్దేశంతో అమ్మ పేరుతో మొక్క అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇంటి ఆవరణతోపాటు రహదారులు, వీధుల్లో నాటిన మొక్కలకు వారే స్వయంగా తమ అమ్మ పేరు పెట్టుకుంటారు. అమ్మ సెంటిమెంట్‌తో కాపాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement