రెబ్బెన: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయిలో జరిగే 45వ సబ్ జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ జాతీ య స్థాయి పోటీలకు రెబ్బెన మండలంలోని గోలేటి సింగరేణి ఉన్నత పాఠశాలకు చెందిన పూదరి సిరి, ఎం.కృష్ణ లోకనందు ఎంపికయ్యారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఇద్దరు క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున జాతీ య స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుప తి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ నారాయణరెడ్డి తదితరులు వారిని అభినందించారు.


