7న సేవా సంకల్ప్‌ యాత్ర | - | Sakshi
Sakshi News home page

7న సేవా సంకల్ప్‌ యాత్ర

Oct 2 2026 11:56 PM | Updated on Oct 2 2026 11:56 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ నిస్వార్థ సేవలను పురస్కరించుకుని సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలో సేవా సంకల్ప్‌ కలశయాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం తెలిపారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన కార్యశాలలో వారు మాట్లాడారు. కలశ యాత్రలో కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సేవా జ్యోతి జిల్లా కన్వీనర్‌ ఎలగతి సుచిత్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్‌, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్‌, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశోక్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు నారా వనజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement