వాగులో ఆదివాసీల నిరసన | - | Sakshi
Sakshi News home page

వాగులో ఆదివాసీల నిరసన

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

కెరమెరి: పెద్దవాగుపై వంతెన, గ్రామానికి రో డ్డు నిర్మించాలని మండలంలోని కొత్తగూడ గ్రా మస్తులు సోమవారం వాగులో నిలబడి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ వర్షానికి పెద్దవాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయని, అత్యవసర సమయంలో ప్రాణాలే పో తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలు గు రోజుల క్రితం ధుర్వ శ్రీనివాస్‌ నీటి ప్రవా హానికి కొట్టుకుపోయి మృతి చెందారని, 15 ఏళ్ల క్రితం ఆయన తండ్రి కూడా ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మరి న్ని ప్రమాదాలు జరగకముందే ప్రభుత్వం స్పందించాలని తహసీల్దార్‌ నాగార్జునకు వినతి పత్రం అందించారు. సర్పంచులు పెందోర్‌ ఆ నంద్‌రావు, తుంరం లచ్చు, నాయకులు సెడ్మకి తుకారాం, వినాయక్‌రావు, పాండు, రమేశ్‌, లచ్చు, సమద్రబాయి, రత్తుబాయి, సోము గుణవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement