ఆసిఫాబాద్‌రూరల్: ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం ఎఫ్‌ఎల్‌ఎన్, ఏఐ ఏఏక్‌ఎల్ కా ర్యక్రమంలో భాగంగా 68 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. డీఈవో మాట్లాడుతూ ఏఐ ఏఏక్‌ఎల్ కార్యక్రమం అమలు చేస్తున్న పాఠశాలల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తెలుగు, గణితం, ఇంగ్లిష్‌లో పురోగతి సాధించే విధంగా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మహేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


