విద్యాసంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యాసంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు హెచ్చరించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఈవోలు, సంబంధిత అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ సంక్షే మ వసతి గృహంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలను నిత్యం కలెక్టర్‌, ఉన్నతాధికారులు తనిఖీ చే యాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరిత మాట్లాడారు. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాన్ని నిరంతరం పర్యవేక్షించేలా అధికారులకు సూచనలు చే స్తున్నామని వివరించారు. సమావేశంలో కాగజ్‌నగ ర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఈవో సచ్చిదానంద చారి, జిల్లా అధికారులు నదీమ్‌, అశోక్‌, అంబాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement