కెరమెరి: జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రా మంలో ఈ నెల 31న నిర్వహించే పూలాజీ బాబా జయంతికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా గిరిజ న సంక్షేమ శాఖ అధికారి జాదవ్ అంబాజీ అన్నారు. పాట్నాపూర్‌లోని పూలాజీ బాబా సంస్థాన్‌లో ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలి పారు. తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం బావి, మట్టిరోడ్డు మరమ్మతులు పరిశీలించి, బల్బులు ఏర్పాటు చేయించారు. ఆయన వెంట ఐటీడీఏ ఈఈ జాదవ్ తానాజీ, ఈజీఎస్ ఏపీవో నగేశ్ తదితరులు ఉన్నారు.


