రెబ్బెన: రాష్ట్ర బాల్‌బ్యాడ్మింటన్ అండర్– 14 బాలబాలికల సెలక్షన్ కమిటీ సభ్యుడిగా గోలే టి టౌన్‌షిప్‌కు చెందిన మారిన వెంకటేశ్వర్లును ఎంపిక చేసినట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మెదక్ జిల్లా బీహెచ్‌ఈఎల్‌లో జరుగుతున్న బాల్‌బ్యాడ్మింటన్ అంతర జిల్లాల పోటీల్లో రాష్ట్ర అండర్– 14 బాలికల జట్టు ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీలో వెంకటేశ్వర్లు సభ్యుడిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జట్టు ఎంపికలో పూర్తిస్థాయిలో పారదర్శకంగా వ్యవహరించి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని తెలిపారు. నమ్మకంతో తన ఎంపికకు కృషి చేసిన జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.


