కాగజ్‌నగర్‌టౌన్: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామ ని, దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు శుక్రవారం కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యేను కలి శారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రత్యేక కార్పొరేష న్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టి చర్చకు పట్టుపడుతామని అన్నారు.


