ఆసిఫాబాద్‌అర్బన్: విద్యార్థులు చదువుతోపా టు క్రీడల్లో రాణించాలని డీవైఎస్‌వో అశ్వక్ హైమద్ అన్నారు. ఈ నెల 29న అంతర్జాతీ య క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ క్రీడామైదానంలో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వివిధ ఆ శ్రమ పాఠశాలలకు చెందిన 50 మంది క్రీడాకారులు వాలీబాల్, షూటింగ్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలకు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు జాతీయ క్రీడాదినో త్సవం సందర్భంగా శనివారం బహుమతులు ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఖేల్ ఇండియా కోచ్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


