ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు 30 ఏళ్ల పాటు ఆదాయం లభిస్తుంది. నాలుగో ఏటా నుంచి తోటలో దిగుబడి మొదలై సంవత్సరం పొడవునా ఆదాయం వస్తూనే ఉంటుంది. పంట దిగుబడిని అమ్మేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రాసెసింగ్ చేసే కంపెనీయే రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంది. జిల్లాలో మొదటగా వేసిన ఆయిల్‌పామ్ తోటల్లో ఈ సంవత్సరం నుంచి దిగుబడి వస్తోంది. ఇప్పటివరకు 1,250 టన్నుల ఆయిల్‌పామ్‌ను విక్రయించగలిగాం.
– ఎంఏ నదీమ్,
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి


