కాగజ్‌నగర్‌టౌన్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాంను ఈ నెల 26న కాగజ్‌నగర్‌కు రావాలని విన్నవించగా సానుకూలంగా స్పందించారని జేఏసీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కిశోర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ ఈర్ల విశ్వేశ్వర్‌రావు, కోకన్వీనర్ సుభాష్ తెలిపారు. మంచిర్యాలలో ఆదివారం కోదండరామ్‌ను మ ర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పట్ట ణంలోని పటేల్ గార్డెన్‌లో ఈ నెల 26న నిర్వహించే ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు కటుకం మధుకర్, యూఎన్ చారి, సిందం శ్రీనివాస్, హన్మంత్‌రావు, దెబ్బటి శ్రీనివాస్, ఇస్తారి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


