కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని మున్నూరు కాపు సంఘం భవనాలకు స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని ఆ సంఘం నాయకులు పట్టణంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌కు ఆదివారం వినతిపత్రం అందించారు. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు గజ్జెల లక్ష్మణ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలోని మండలా ల్లో సంఘం భవనానికి 20 గుంటల భూమిని కేటాయించాలని, నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సమావేశాలు, సా మాజిక కార్యక్రమాలకు భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మహేశ్, నాయకులు జలపతి, రామయ్య, సత్యనారాయణ, చంద్రయ్య, సూ ర్య,ం రామయ్య, శ్రీనివాస్, వెంకటేశ్, రామ్‌చందర్, సురేశ్, రాజేందర్ పాల్గొన్నారు.


