సర్కారు బడుల్లో అందుబాటులోకి.. 6 నుంచి 10 తరగతి వరకు బోధన ఉమ్మడి జిల్లాలో 344 పాఠశాలలు ఎంపిక ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాల పెంపే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో ఇక కంప్యూటర్ పాఠాలు అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్ బోర్డు, చాక్‌పీస్‌కే పరిమితమైన బోధన త్వరలోనే డిజిటల్ రూపంలోనూ అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు పుస్తకాలతో పాటు కంప్యూటర్ స్క్రీన్‌పై పాఠాలు చూసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యను మరింత ఆసక్తికరంగా, సులభంగా, సాంకేతికతతో అనుసంధానం చేసే లక్ష్యంతో కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 344 పాఠశాలలను ఎంపిక చేసింది. 6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులు డిజిటల్ బోధన ద్వారా భవిష్యత్ అవసరాల కు అనుగుణమైన నైపుణ్యాలను సొంతం చేసుకునే అవకాశం లభించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. ఆదిలాబాద్ జిల్లాకు శివబాలాజీ కన్సల్టెన్సీ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. 2008లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సర్కారు బడుల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించగా 2014 వరకు కొనసాగింది. ఆ తర్వాత అ టకెక్కడంతో విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టడంతో పేద విద్యార్థులకు మేలు చేకూరనుంది.
డిజిటల్ నైపుణ్యాలే భవిష్యత్తు..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, వ్యాపారం, వ్యవసా యం, పరిశోధన తదితర అన్నీ కంప్యూటర్ సాంకేతి కతపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు చిన్నప్పటి నుంచే డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తోంది. తద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ లెర్నింగ్, ఈ–కంటెంట్ వినియోగం, సాంకేతిక సమస్యల పరిష్కా రం వంటి ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే డిజిటల్ వనరు ల వినియోగం ద్వారా పట్టణ, గ్రామీణ విద్యార్థుల మధ్య ఉన్న విద్యా అంతరాన్ని తగ్గించడంలో ఈ కార్యక్రమం కీలకంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
కంప్యూటర్ విద్యతో సాంకేతిక పరిజ్ఞానం
ఆదిలాబాద్ జిల్లాలోని 102 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శివబాలాజీ కన్సల్టెన్సీ వారు పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలు చేయనున్నారు. ఒక పాఠశాలలో వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులకు సాంకేతిక పాఠాలు బోధిస్తారు. మరమ్మతుకు గురైన కంప్యూటర్లను ఇప్పటికే బాగు చేయడం పూర్తయింది.
– మాధవి, డీఈవో, ఆదిలాబాద్
సర్కారు విద్యలో డిజిటల్ విప్లవం..
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య అమలు విద్యారంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఆధునిక సాంకేతికతను విద్యతో అనుసంధానం చేయడం ద్వారా సర్కారు బడులను నాణ్యమైన విద్య కు కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ విధానాన్ని మరిన్ని పా ఠశాలలకు విస్తరించి ప్రతి విద్యార్థికి డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఉమ్మడి జిల్లా పరిధిలో..


