టీచర్లు ఏఐ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

టీచర్లు ఏఐ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి

Jul 9 2026 6:29 AM | Updated on Jul 9 2026 6:29 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: రేపటి తరం విద్యార్థులను ఉన్నతంగా తయారు చేయాలంటే ఉపాధ్యాయులు ముందుగానే ఏఐ గురించి సమగ్రంగా తెలుసుకోవాలని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమానికి బుధవారం డీఈవో సచ్చిదానంద చారితో కలిసి హాజరయ్యారు. ఉపాధ్యాయులకు పలు అంశాలపై సూచనలు చేశారు. ఐసీటీ టూల్స్‌ వినియోగం, ఫిజి క్స్‌లో ఏఐ వాడకం గురించి వివరించారు. సమగ్ర విద్య అభ్యసన కార్యక్రమాలకు హాజరవుతూ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు డిజిటల్‌ లిటరసీపై అవగాహన కల్పించేలా బోధన చేయాలన్నారు. డీఈవో మాట్లాడుతూ పిల్లల స్థాయికి తగినట్లు బోధన సాగించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి ఉమబాల, శిక్షకులు రాజనర్సులు, శ్రీనాథ్‌, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement