‘దివ్యాంగుల హామీల అమలులో విఫలం’ | - | Sakshi
Sakshi News home page

‘దివ్యాంగుల హామీల అమలులో విఫలం’

Jul 9 2026 6:29 AM | Updated on Jul 9 2026 6:29 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. పట్టణంలోని బాలభారతి ఉన్నత పాఠశాలలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యూఎన్‌ సీపీఆర్డీ ఒప్పందానికి అనుగుణంగా దివ్యాంగుల చట్టాలను మార్చాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం జూన్‌ 2 నాటికి రెండు లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌, నాయకులు సరిత, దస్తగిర్‌, విలాస్‌, రమేశ్‌, పాషామియా, నరేశ్‌, గోపి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement