బంబారలో జ్వర పీడితుల సర్వే | - | Sakshi
Sakshi News home page

బంబారలో జ్వర పీడితుల సర్వే

Jul 9 2026 6:29 AM | Updated on Jul 9 2026 6:29 AM

వాంకిడి: మండలంలోని బంబార గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్‌ సర్వే నిర్వహించారు. వర్షాకాలంలో దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైడే ప్రాముఖ్యత, జ్వరాలు రావడానికి గల కారణాలు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వైద్యశిబిరం నిర్వహించి 43 మందికి పరీక్షలు చేశారు. నలుగురు జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి పెందుర్‌ రవిదాస్‌, వార్డు మెంబర్‌ సాలక్క, ఏఎన్‌ఎం సునంద, ఆశ వర్కర్లు లక్ష్మి, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement