ఆసిఫాబాద్/కెరమెరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలిచి ఉంటారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జైనూర్ మండల కేంద్రంలో బుధవారం వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీ సభ్యులు పెందోర్ ప్రకాశ్, సుద్దాల శ్రీనివాస్, సర్పంచ్ మడావి మనోహర్, నాయకులు తొడసం రాజేందర్, ఉయక చందు, మెస్రం స్పందన, భూపత్, షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.


