నాణ్యత ప్రమాణాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యత ప్రమాణాలు పాటించాలి

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

● ఎంపీ గోడం నగేశ్‌

తిర్యాణి: కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. మండలంలోని సుంగాపూర్‌ గిరిజన పాఠశాల(శాటిలైట్‌) అదనపు తరగతుల కోసం నిర్మించిన భ వనాన్ని గురువారం పరిశీలించారు. రెండు నెలల్లోగా భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాల ని ఏఈ కిరణ్‌ను ఆదేశించారు. అలాగే గ్రామంలో పీఎం జన్‌మన్‌ పథకం కింద చేపడుతున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదా రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులు సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరిశీలించా రు. వసతిగృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాటిలైట్‌ ప్రాథమిక పాఠశాలల ను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చే స్తామని తెలిపారు. మండలంలోని రోడ్ల నిర్మాణాలను అటవీ అనుమతులు మంజూరు చేసి, పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న హాస్టల్‌ భవనాన్ని పరిశీలించారు. నాణ్యమైన ఇసుక వాడాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు శ్రీశైలం, నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్నాక విజయ్‌, నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, సార రమేశ్‌గౌడ్‌, పులి వెంకటేశ్‌, విశాల్‌, కిరణ్‌, చక్రపాణి, ఆంజనేయులుగౌడ్‌, మురళీ, సునీల్‌చౌదరి, వల్క శ్రీధర్‌, సీతారాం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలోని పీఎంశ్రీ కేజీబీవీలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులను గురువారం ఎంపీ గోడం నగేశ్‌ పరిశీ లించారు. కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం కింద పాఠశాలలను బలోపేతం చేస్తుందన్నారు. అలాగే కుమురంభీం ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. డ్యామ్‌ ఉంటదా.. పోతదా.. అని రైతులు ఆందోళనకు గు రవుతున్నారని, ప్రాజెక్టు, కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement