తునికాకు డబ్బుల గోల్‌మాల్‌! | - | Sakshi
Sakshi News home page

తునికాకు డబ్బుల గోల్‌మాల్‌!

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

పలువురి బినామీల ఖాతాల్లోకి మళ్లింపు ఆన్‌లైన్‌లో నమోదు కాని కూలీల వివరాలు బీట్‌ అధికారిపై ఆరోపణలు

చింతలమానెపల్లి: మండలంలోని ఖర్జెల్లి రేంజ్‌ గూ డెం బీట్‌లో తునికాకు కూలీల డబ్బుల చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వ స్తున్నాయి. అర్హుల డబ్బులు కాజేసేందుకు బీట్‌ అ ధికారి తప్పుడు వివరాలు నమోదు చేసినట్లుగా కూ లీలు ఆరోపిస్తున్నారు. గూడెం ఆకుల కల్లం పరిధి లో 140 కూలీలు ఉండగా 3,15,900 కట్టల తునికా కు సేకరించారు. వీరికి రూ.10,74,060 చెల్లించాల్సి ఉంది. అలాగే బూరుగూడ తునికాకు కల్లం పరిధి లో 78 మంది కూలీలు 1,54,456 కట్టలు సేకరించగా, వారికి రూ.5,25,152 కూలీలకు మంజూరయ్యాయి. గూడెం బీట్‌ పరిధిలో తొమ్మిది రోజుల పాటు తునికాకు సేకరణ కొనసాగి మే 19న ముగిసింది. సాధారణంగా కూలీలు, కట్టల వివరాలను కూలీల వద్ద ఉన్న కార్డుతోపాటు కల్లెదార్‌ వద్ద ఉన్న రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఇవే వివరాలను తునికాకు సేకరణ పూర్తయిన అనంతరం బీట్‌ అధికారి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇక్కడే 15 మంది వివరాలు గల్లంతయ్యాయి. కల్లెదార్‌లు మే 25లోగానే బీట్‌ అధికారి నవ్యశ్రీకి వివరాలు అందించారు. ఈ వివరాలను సదరు బీట్‌ అధికారి జూన్‌ 15లోగా ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది.

బినామీల ఖాతాల్లోకి నగదు

గూడెం కల్లానికి సంబంధించి 12మంది వివరాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. వీరికి సంబంధించి రూ.89,224 ఇతరుల ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించినట్లుగా కూలీలు ఆరోపిస్తున్నారు. బూరుగూడ కల్లం పరిధిలో ముగ్గురి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. తునికాకు సేకరణ చేయని దేశ్‌ముఖ్‌ ప్రవీణ్‌ ఖాతాలో రూ.97,705, రౌతు గణప తి ఖాతాలో రూ.42,187 జమయ్యాయి. దీనిపై గూడెం బీట్‌ అధికారి నవ్యశ్రీపై కూలీలు ఆరోపణ లు చేస్తున్నారు. తమ ఖాతాలను ఆన్‌లైన్‌ చేయకుండా బినామీలతో డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించారని మండిపడుతున్నారు. ఖాతాల్లో డబ్బులు వారం రోజుల క్రితమే జమయ్యాయని, అయినా ఇప్పటివరకు తమకు చెల్లించలేదని ఆరోపించారు. ఈ విషయంపై కల్లెదార్‌లను నిలదీయడంతో.. వారు అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తునికాకు డబ్బులు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement