ఉమ్మడి డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం జోరందుకున్న కాంగ్రెస్ ముఖ్య నాయకుల పైరవీలు అధిష్టానం ఆశీస్సుల కోసం హైదరాబాద్‌లో ప్రయత్నాలు
సాక్షి, ఆదిలాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లలో అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు డైరెక్టర్ పదవులను నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా సొసైటీల్లో ఈ పదవులపై ఇంకా ఒక కొలిక్కి రాకముందే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమి టెడ్ (డీసీఎంఎస్) అధ్యక్ష పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో పోరు మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి పదవులు కావడంతో నాలుగు జిల్లాల నుంచి హస్తం పార్టీ ముఖ్య నాయకులు ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. అధిష్టానం ఆశీస్సుల కో సం పలువురు ఆశవాహులు ఇప్పటికే హైదరాబాద్‌లో మకాం వేశారు. పూర్తి భరోసా లభిస్తేనే ఆయా సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఉమ్మ డి జిల్లాలో ఈ నామినేటెడ్ కమిటీల ఏర్పాటుతో పా టు డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్ష స్థానాలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. మొదట పీఏసీఎస్‌లలో నామినేటెడ్ కమిటీల ఏర్పాటు త ర్వాత ఆయా సంఘాలకు అధ్యక్షులుగా ఎన్నికై న వారు డీసీసీబీతో పాటు డీసీఎంఎస్‌లలో డైరెక్టర్లుగా ప్రాతి నిధ్యం వహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వారిలో నుంచి ఈ రెండింటికి అధ్యక్షులను నా మినేటెడ్ చేయడం జరుగుతుంది. ఆయా జిల్లాల నుంచి సొసైటీలలో నామినేటెడ్ క మిటీల్లో చోటు కోసం పలువురు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నా రు. పార్టీలో కీలకంగా ఉన్న ముఖ్య నా యకులు మాత్రం మొదట చైర్మన్ పదవి ఇస్తామని అధిష్టానం భరోసానిస్తే సంఘాల నుంచి ప్రాతినిఽ ద్యం వహించేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.
జోరుగా ప్రయత్నాలు..
ఈ రెండింటిలో డీసీసీబీ అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నాయకులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి డీసీసీబీ మాజీ చైర్మన్లు దామోదర్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డితో పాటు మాజీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి ఈ నామినేటెడ్ పదవి కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డెయిరీ మాజీ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి రాష్ట్ర నాయకుల మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
సొంత గూటిలో పోటీ..
డీసీసీబీ నామినేటెడ్ అధ్యక్ష పదవి కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్న జిల్లాకు చెందిన ముఖ్య నా యకులకు ఆయా సహకార సంఘాల్లో తీవ్ర పోటీ నెలకొంది. తలమడుగు సహకార సంఘం నుంచి దామోదర్‌రెడ్డి బరిలో ఉండాలని భావిస్తున్నప్పటికీ అక్కడ మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి కూడా పదవి ని ఆశిస్తుండటం ఆసక్తికరంగా మారింది. జైనథ్‌లో మాజీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి పదవిని ఆశి స్తుండగా, అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి రాంరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో పలువురు ముఖ్య నేతల ద్వారా చైర్మన్ పదవి కోసం పైరవీలు చేస్తున్నారు.
ఆసక్తికరం..
గతంలో డీసీసీబీ చైర్మన్‌లుగా వ్యవహరించిన దామోదర్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి మరోసారి ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనను ఈ పదవికి నామినేటెడ్ చేయాలని నరేష్ జాదవ్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పినప్పుడు తాను అందుకు సహకరించానని, ఆ సమయంలోనే తనకు ముఖ్యమైన పదవి ఇవ్వాలని తన అనుచరులు జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కోరడం జరిగిందని, దానికి మంత్రి సమ్మతించారనే భరోసాతో ఆడే గజేందర్ ఉన్నారు.


