దహెగాం: రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు పేదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంగళవారం నిర్వహించిన వారసంతల్లో నిత్యావసరమైన టమాటా, పచ్చిమిర్చి ధరలు చుక్కలన్నంటాయి. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు పోషకాహారం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నాయి. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, రవాణా ఖర్చుల పెరుగుదల, నిల్వ సదుపాయాల కొరత తదితర అనేక కారణాలతో రేట్లకు రెక్కలు వస్తున్నాయి. స్థానిక రైతులు పండించడపోవడంతో వారసంతలకు సరఫరా తగ్గుతుంది. ఆగస్టు వరకు కూరగాయల ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు.


