విధుల్లో అలసత్వం వహిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అలసత్వం వహిస్తే సహించం

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌: వైద్యాధికారులు, సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించమని కలెక్టర్‌ కె.హరిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి అదన పు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి మంగళవారం జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించా లన్నారు. వైద్యులు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమయపాలన పాటించాలని సూ చించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా ప్రతిఒక్కరూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సిబ్బంది హాజరు, పనితీరును యాప్‌లో ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మందులు, టీకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్ర, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు

ఆసిఫాబాద్‌: వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకా శాలు లభిస్తాయని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జై నూర్‌ మండల కేంద్రంలోని ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు మూడు నెలలపాటు హైదరాబాద్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పి స్తారని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియో గం చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియ న్‌, ఫాల్స్‌ సీలింగ్‌ టెక్నీషియన్‌, వెల్డింగ్‌, ఫాబ్రికేష న్‌, బైక్‌ రిపేరింగ్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటీవ్‌(బాలికలు), ఎలక్ట్రికల్‌ హోం అప్లయన్సెస్‌ రిపేరింగ్‌, ఏసీ రిపేరింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement