‘పోడు’ సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

‘పోడు’ సమస్యలు పరిష్కరించండి

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ నియోజకవర్గంలో ని పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంగళవారం ఇన్‌చార్జి పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలమానెపల్లి మండలం దిందా, కర్జెల్లి, బెజ్జూర్‌ మండలం పాపన్‌పేట్‌, పెంచికల్‌పేట్‌ మండలం దరోగపల్లి తదితర గ్రామాల్లో అటవీ అధికారులు పోడు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని తెలి పారు. వెంటనే పోడు భూముల స్వాధీన ప్ర క్రియ నిలిపివేయాలని కోరారు. సానుకూలంగా స్పందించి డీఎఫ్‌వోకు ఆదేశాలు ఇస్తామ ని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎల్ల్ములే మల్లయ్య, డబ్బుల మురళి, తుకారాం, చౌదరి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement