వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

కెరమెరి: గిరిజన హాస్టళ్లలో పని చేస్తున్న దినసరి, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్ప, జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమాచారి డిమాండ్‌ చేశారు. మండలంలోని హట్టి బేస్‌ క్యాంపులోని కుమురంభీం విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కమి టీ సమావేశంలో మాట్లాడారు. గతంలో జరి గిన 44 రోజుల సమ్మెలో గిరిజన శాఖ మంత్రి పాల్గొని పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. వర్కర్లకు టైంస్కేల్‌, ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు సురేఖ, సంపత్‌, బిజులాబాయి, లక్ష్మీబాయి, జారుబాయి, లలిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement