సదస్సుకు తరలిన టీబీజీకేఎస్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

సదస్సుకు తరలిన టీబీజీకేఎస్‌ నాయకులు

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

రెబ్బెన: గోదావరిఖనిలో టీబీజీకేఎస్‌ ఆధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు బెల్లంపల్లి ఏరియా నుంచి ఆ యూనియన్‌ నాయకులు పెద్దఎత్తున తరలివెళ్లారు. బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణే ధ్యేయంగా టీబీజీకేఎస్‌ పోరాటం చేస్తోందని అన్నారు. తమ హయాంలో కేసీఆర్‌ సహకారంతో సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించామన్నారు. వాటిని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం కాలరాస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏరియా నాయకులు కార్నాథం వెంకటేశ్‌, తిరుపతి, బొంగు వెంకటేశ్‌, చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement