కేశవరావు కమిటీని స్వాగతిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

కేశవరావు కమిటీని స్వాగతిస్తున్నాం

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేశవరావు కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉద్యమకారుల వేదిక కన్వీనర్‌ ఈర్ల విశ్వేశ్వర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని పటేల్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారునలు గుర్తించి జాబితా తయారు చేస్తామన్నారు. ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు కూడా నేడు ఉద్యమకారులుగా చెప్పుకుంటూ సర్టిఫికెట్ల పేరుతో రూ.500 చొప్పున వసూలు చేస్తున్న విషయం తమదృష్టికి వచ్చిందన్నారు. నిజమైన ఉద్యమకారులు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఆధ్వర్యలో త్వరలోనే చైర్మన్‌ కేశవరావును కలుస్తామన్నారు. సమావేశంలో నాయకులు సుభాష్‌, పాల్వాయి సుధాకర్‌రావు, సిందం శ్రీనివాస్‌, దెబ్బటి శ్రీనివాస్‌, రమేశ్‌గౌడ్‌, జయదేవ్‌, అబ్రహం, తుమ్మ రమేశ్‌, దుర్గం విస్తారు, జాడి కేశవ్‌, గోగర్ల కన్నయ్య, తాజ్‌బాబా, కొప్పుల శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement