ఎస్పీఎం కార్మికులకు నిరాశే మిగిల్చారు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీఎం కార్మికులకు నిరాశే మిగిల్చారు

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సభలో ఎస్పీఎం కార్మికుల సమస్యలపై మాట్లాడుతారని అనుకుంటే వారికి నిరాశే మిగిల్చారని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 17 రోజులుగా కార్మికులు రిలే నిరహారదీక్షలు చేస్తున్నా ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పట్టించుకోకపోవ డం దారుణమన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం కార్మికుల సమస్యలపై మాట్లాడకుండా వెళ్లి పోయారని విమర్శించారు. తమగోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన కార్మికులను పోలీస్‌స్టేషన్‌కు తరలించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి వెంటనే స్పందించి మిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement