కాగజ్‌నగర్‌టౌన్: అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు. శనివారం పట్టణంలోని 8, 9, 10, 11, 12 వార్డుల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా తమ కాలనీలో డ్రెయినేజీలు ఆక్రమణకు గురికావడంతో వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని, సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు వినతిపత్ర ం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్ కమిషనర్ తిరుపతి, సీఐ ప్రేంకుమార్, కౌన్సిలర్ గజ్జెల లావణ్య, గజ్జెల లక్ష్మన్, ము న్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


