ఆసిఫాబాద్‌అర్బన్: విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. శనివారం డీఈవో సచ్చిదానందచారితో కలిసి తిర్యాణి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మాణిక్యాపూర్‌లోని కేజీబీవీని సందర్శించారు. తరగతి గదులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో ఆకాంక్షిత బ్లాక్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


