పరిసరాల పరిశుభ్రత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

ఆసిఫాబాద్‌: వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ పరి సరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను పడవేయడం వల్ల మురుగు నీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వార్డు సమస్యలు కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య, వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం, జెబాషేక్‌, ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీనారాయణ, నాయకులు సాయి శ్రావణ్‌, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement