చెలిమలలో బర్డ్‌వాక్‌ | - | Sakshi
Sakshi News home page

చెలిమలలో బర్డ్‌వాక్‌

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

తిర్యాణి: ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మండలంలోని చెలిమల వాగు ప్రాజెక్టు ఆవరణలో బర్డ్‌వాక్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్‌ అధికారి రమాదేవి మాట్లాడుతూ చెలిమల వాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో దాదా పు 180కి పైగా అరుదైన పక్షి జాతులు ఉన్నట్లు తెలి పారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, క్షేత్రస్థాయిలో వన్యప్రాణుల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డెక్కన్‌ బర్డర్స్‌ సభ్యులు, జెడ్పీ పాఠశాల విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement