వాంకిడి: వర్షాకాలంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని డీపీవో భిక్షపతి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని సవాతి, దొడ్డిగూడ గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షణ, వనమహోత్సవం, మ్యాజిక్ ఇంకు డు గుంతల నిర్మాణం, దోమల నివారణ, స్వచ్ఛత, పారిశుద్ధ్యం, తదితర అంశాలు వివరించారు. అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా నాటే మొక్కల సంరక్షణను అందరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. సమగ్ర ఓటరు సవరణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరద ప్రభావిత గ్రామాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కవిత, ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న, ఎంపీవో ఖాజా అజీజుద్దీన్, ఏవో గోపికాంత్, ఏపీవో శ్రావణ్ కుమార్, సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


