పంట మారుద్దాం.. | - | Sakshi
Sakshi News home page

పంట మారుద్దాం..

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

వర్షాలు తగ్గితే స్వల్పకాలిక పంటల సాగే మేలు అప్రమత్తంగా లేకుంటే అన్నదాతలకు నష్టాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యవసాయశాఖ

ఎల్‌నినోను ఎదుర్కొందాం..

కౌటాల: రుతుపవనాల రాకకు ముందే అడపాదడ పా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు సాగు కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చేలు సిద్ధం చేసుకు ని భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయి తే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ ర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగుపై కాకుండా.. పంట మార్పిడి విధా నం పాటించాలని వ్యవసాయ అధికారులు సూచి స్తున్నారు. తక్కువ నీటితో పంటలు పండిస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చంటున్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి పంట మార్పిడి చేసుకుంటే భూసారం పెరుగుతుందని, తెగుళ్ల బెడదను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు.

తగ్గుతున్న పత్తి దిగుబడులు

జిల్లాలో 4.50లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు పండిస్తుండగా, అందులో అత్యధికంగా 3,70,919 ఎకరాల్లో తెల్ల బంగారంగా పిలిచే పత్తి, ఆ తర్వాత 42,228 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. 2010 త ర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ప్రారంభంలో ఎర్ర నేల్లో 10 క్వింటా ళ్లు, నల్లరేగడి నేలల్లో 15 క్వింటాళ్ల దిగుబడి రాగా కాలక్రమేణ పరిస్థితులు మారాయి. చీడపీడల ఉధృతి పెరగడం, వరదలు ముంచెత్తడం, ఇతర కారణా లతో ప్రస్తుతం ఎకరానికి 2 నుంచి 5 క్వింటాళ్లు మించడం లేదు. ఏళ్లుగా సేంద్రియ ఎరువులు విని యోగించకపోవడం, రసాయనిక ఎరువులపైనే ఆ ధారపడుతుండటంతో నేలలో కార్బన్‌, సూక్ష్మపోషకాలు లోపిస్తున్నాయి. మరోవైపు నకిలీ పత్తి విత్తనా లు జిల్లా రైతులను నిండా ముంచుతున్నాయి. నష్టాలు ఉన్నా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించకపోవడంతో కోలుకోలేకపోతున్నారు.

తగ్గిన సోయా, కంది సాగు

జిల్లా రైతులు పత్తి, వరి పంటల సాగుపైనే అధికంగా ఆధారపడుతున్నారు. వర్షాధార పంటల్లో పత్తి సాగుదే ప్రథమ స్థానం. పదేళ్ల క్రితం లక్ష ఎకరాల్లో సాగు చేసిన సోయా పంట ప్రస్తుతం జిల్లాలో కేవలం వందల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. కంది సైతం 40 వేల ఎకరాల నుంచి సగానికి పడిపోయి 20వేల ఎకరాల్లో మాత్రమే సాగవుతుంది. మరోసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారిస్తే మేలు. స్వల్పకాలిక పంటల సాగుతో నష్టాలు కూడా తక్కువగా ఉంటాయి.

పత్తి సాగుతో నష్టాలు

ఏళ్ల తరబడిగా పత్తి సాగు చేస్తున్నా. ఒక ఏడాది దిగుబడి వస్తే మరోసారి రాదు. ఆరేళ్లుగా పెట్టుబడులు కూడా రావడం లేదు. నష్టాలే తప్ప మిగులు ఉండటం లేదు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం కూడా అందడం లేదు. రైతులు నష్టపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా..

– దామోదర్‌, యాపలగూడ, మం.కౌటాల

అవగాహన కల్పిస్తున్నాం

రైతులు ఏటా ఒకే రకమైన పంటలు సాగు చేస్తే క్రమేనా దిగుబడి తగ్గుతుంది. పంట మార్పిడితో నేలసా రం పెరగడంతోపాటు తెగు ళ్లు తగ్గుతాయి. సేంద్రియ ఎరువుల వాడకంతో పెట్టుబడులు అదుపులో ఉంచుకోవచ్చు. పంట మార్పిడి, పంట సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పి స్తున్నాం.

– వెంకటి, జిల్లా వ్యవసాయ అధికారి

తొందరపడి విత్తుకోవద్దు

ఎల్‌నినో ప్రభావంతో ఈసా రి వర్షపాతం తక్కువగా న మోదయ్యే అవకాశం ఉంటుంది. అన్నదాతలు దీర్ఘకా లిక పంటలు కాకుండా స్వ ల్పకాలికల సాగుకు సిద్ధం కావాలి. వర్షం పడిన వెంటనే రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకో వద్ద. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలపై దృష్టి సారించాలి.

– డా.శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌, కొండాలక్ష్మణ్‌

తెలంగాణ ఉద్యాన శాఖ యూనివర్సీటీ

జిల్లాలో సాగు వివరాలు

ఇలా చేస్తే మేలు

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొల్లాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరుప, టమాటా, క్యాబేజీ, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేయకూడదు. ఆకు ముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సొయచిక్కుడు వేయకూడదు. యాసంగిలో వేరుశనగ వేసుకున్న రైతులు ఖరీఫ్‌లో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభి స్తోంది. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. కంది, శనగ పైర్లను వరసగా వేస్తే కాయతొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సొయ చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలువ, మెట్ట వరితో పంట మార్పిడి చేసుకోవాలి. వరి వరుసగా సాగు చేయకుండా పప్పు ధాన్యాలు, నూనెగింజలు పండించాలి. పంటను మారిస్తే చీడపీడల ఉధృతి తగ్గుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement