ప్రీప్రైమరీ.. మరింత బలోపేతం | - | Sakshi
Sakshi News home page

ప్రీప్రైమరీ.. మరింత బలోపేతం

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

జిల్లాలో మరో 77 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్లు నిండగానే ఆ స్కూళ్లలో నే చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు లేకపోవడంతో ప్రవేశాలు తగ్గుతున్నాయని విద్యాశాఖ గుర్తించింది. ఈ క్రమంలో సర్కా రు బడుల్లోనూ విడతల వారీగా ప్రీప్రైమరీ తరగతులు అమలు చేస్తోంది. 2020 జాతీయ విద్యావిధానా న్ని అనుసరించి జిల్లాలో ఇప్పటికే 41 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య కొనసాగుతోంది. 2026– 27 విద్యాసంవత్సరంలో మరో 77 పాఠశాలల్లో అమలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి జిల్లా విద్యాధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 60 ఉన్నత పాఠశాలలు, 101 ప్రాథమికో న్నత, 561 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 2026– 27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాల్లో ప్రీప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో కొత్తగా 77 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించేందు కు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జి ల్లాలో ఇప్పటికే 41 ప్రీప్రైమరీ పాఠశాలు కొనసాగుతుండగా కొత్తవాటితో కలుపుకొని ఆ సంఖ్య 118కి చేరింది. జూన్‌ 12 నుంచి జిల్లాలో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా పాఠశాలల్లో ఇన్‌ఫ్రాస్టక్చర్‌, ఫర్నీచర్‌, ఇండోర్‌, ఔట్‌డోర్‌ ఆట వస్తువులు, పెయింటిగ్స్‌ వంటి ఏర్పాట్ల కోసం ప్రతీ స్కూల్‌కు రూ.1.70 లక్షల చొప్పున కేటాయించనున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలు, అక్షరమాలలు, జంతువులు, పక్షులు బొమ్మలు వేయించనున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో 2026– 27 విద్యా సంత్సరానికి మంజూరైన 77 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఒక్కొక్క పాఠశాలకు ఒక్కరి చొప్పున ఇన్‌స్ట్రక్టర్‌, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9వ తేదీలోపు విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు చే సుకోవాలని సూచించారు. ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుకు ఇంటర్మీడియట్‌, ఆయా పోస్టుకు ఏడో తరగ తి పాసై ఉండాలని తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8వేలు, ఆయా పోస్టులకు రూ.6 వేల చొప్పున పది నెలలు గౌరవ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నూతన ప్రీప్రైమరీ స్కూళ్లు ఇలా..

మండలం ప్రీప్రైమరీ పాఠశాలలు

ఆసిఫాబాద్‌ 9

కెరమెరి 4

జైనూర్‌ 7

రెబ్బెన 3

కాగజ్‌నగర్‌ 22

దహెగాం 15

చింతలమానెపల్లి 5

బెజ్జూర్‌ 3

కౌటాల 5

పెంచికల్‌పేట్‌ 3

సిర్పూరు(టి) 1

154 మందికి ఉద్యోగావకాశం

జిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలల్లో పనిచేసేందుకు 154 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. తాత్కాలిక పద్ధతిలో ఒక ఇన్‌స్ట్రక్టర్‌, ఒక ఆయాను నియమించనున్నారు. వీరికి గౌరవ వేతనంగా నెలకు రూ.8 వేలు, రూ.6 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేసి త్రీ మెన్‌ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. పాఠశాలల్లో వచ్చేనెల ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement