రేపు మినీ జాబ్‌మేళా
ఆసిఫాబాద్‌అర్బన్: కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 6న(శనివారం) ఉదయం 10 గంటలకు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్న ట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 91605 08476, 79897 73351 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు షురూ
రెబ్బెన: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ మొదలైందని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరమేశ్ తెలిపారు. సింగరేణి ఉద్యోగుల వారసుల కోసం ప్రత్యేకంగా 150 సీట్లు కేటాయించారన్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో 30, కంప్యూటర్ సైన్స్ 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ 30, మెకానికల్ ఇంజినీరింగ్ 30, మైనింగ్‌లో 30 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 8లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల వెబ్‌సైట్ లేదా 87901 12515, 99081 51618, 90102 22161 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.


