కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో శుక్రవారం నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్12 వరకు కొనసాగే పరీక్షలకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 530 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు హాల్‌టికెట్‌తో గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
ఏర్పాట్లు పూర్తి
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ జెడ్పీహెచ్‌ఎస్(బాలికలు), కాగజ్‌నగర్(సర్‌సిల్క్) జెడ్పీహెచ్‌ఎస్(బాలికలు), సిర్పూర్(టి) జెడ్పీహెచ్‌ఎస్‌లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 530 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 18 మంది ఇన్విజిలేటర్లు, ఒక అబ్జర్వర్, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తదితరులు విధులు నిర్వహించనున్నారు.
ప్రతీ కేంద్రం వద్ద నిఘా
టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో అన్నిఏర్పాట్లు చేశాం. మూడు కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీసు నిఘా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకున్నాం.
– సచ్చిదానంద చారి, జిల్లా విద్యాశాఖ అధికారి


