అర్హులకు పథకాలు అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అర్హులకు పథకాలు అందించడమే లక్ష్యం

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

● అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యక్రమంలో భాగంగా గురువారం ఆసిఫాబా ద్‌ మండలం బాబాపూర్‌ పంచాయతీలో గ్రామ స భ నిర్వహించారు. అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయ న మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన ఉండాలని, ఇంటి వద్దే పొడి, తడి చెత్తను వేరు చేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో కాలువల శుభ్రత పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల వ్యా ప్తిని అరికట్టేందుకు పరిశుభ్రత పాటించాలన్నారు. రైతులు పంటల మార్పిడి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని, నీటి లభ్యత, మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులను అనుసరించాలని కోరారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమం ప్రాముఖ్యత, ఓటరు జాబితా నవీకరణలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్‌, డీఎల్పీవో ఉమర్‌ హుస్సేన్‌, తహసీల్దార్‌ రియాజ్‌ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో మౌనిక, సర్పంచ్‌ రాజన్న, ఉపాధిహామీ ఏపీవో బుచ్చన్న, పంచాయతీ కార్యదర్శి దేవరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement