ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో అటవీ సంరక్షణ కు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమ ని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అ న్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రో జుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ సంరక్షణ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ అడవుల ప్రాధాన్యతను ప్రజలు స్వచ్ఛందంగా తెలుసుకుంటేనే సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో గోవింద్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేశ్, సరోజారాణి, ఝాన్సీరాణి, ఎఫ్‌ఎస్‌వోలు, బీట్ అధికారులు పాల్గొన్నారు.


